మెగాస్టార్ తో మరో మెగా హీరో ?

మెగాస్టార్ తో మరో మెగా హీరో ?

Published on Jun 24, 2026 7:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఇప్పుడు మరో హీరో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేlషన్‌లో ఓ సినిమా రాబో కార్తుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సినిమా క్లైమాక్స్ లో ఓ గెస్ట్ రోల్ ఉందని.. ఆ రోల్లో మరో మెగా హీరో సాయి దుర్గా తేజ్ కనిపించబోతున్నాడని టాక్. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

పైగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. అలాగే, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు