సాయి పల్లవి అంత పెద్ద అఫర్ తిరస్కరించిందా…?

Published on Apr 16, 2019 2:00 am IST

చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి తన తోటి నటీనటులందరి కంటే తానూ చాలా విభిన్నం అని సాయి పల్లవి మరోసారి నిరూపించుకుంది. తనకున్న గొప్ప సహజ నటనతో ప్రేక్షకులందరిని కట్టిపడేసి, ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకున్న సాయి పల్లవి, తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా తానూ ఇప్పటివారికి ఒక్క వాణిజ్య ప్రకటనలో కనిపించడానికి ఇష్టపడటం లేదు. దానికి తోడు తాజాగా సాయి పల్లవి ఒక భారీ ఆఫర్ ని కూడా తిరస్కరించింది కూడా…

తాజాగా ఒక ప్రముఖ పేస్ క్రీం సంస్థ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని సాయి పల్లవిని సంప్రదించగా, అందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదట. ఆ పేస్ క్రీం సంస్థ సాయి పల్లవికి 2 కోట్ల రూపాయలని పారితోషకంగా ఇస్తానని ప్రకటించినప్పటికీ కూడా సాయి పల్లవి చాల సున్నితంగా తిరస్కరించింది. దానికి కారణం “సినిమాల్లో కూడా తాను మేకప్ వేసుకోకుండా నటిస్తున్నానని, అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని జనాలను తాను ఎలా ప్రోత్సహిస్తానని ఆమె చెప్పింది”. కాగా ఆ సంస్థ మేకప్ లేకుండానే తమ ప్రకటనలో నటించమని సాయి పల్లవిని కోరిన కూడా, అసలే ఒప్పుకోలేదంట.

సంబంధిత సమాచారం :