ఇప్పుడు మన టాలీవుడ్ లో ఆల్ టైం మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబే అని అంటారు. నాలుగు పదుల వయసులో కూడా చార్మింగ్ పర్సనాలిటీ తో మహేష్ ఎప్పటికప్పుడు యంగ్ గా కనిపించి ఆశ్చర్యపరుస్తారు. అయితే మరి అంత హ్యాండ్సమ్ గా కనిపించే ఈ స్టార్ హీరో కోసం ఇప్పుడు యూత్ లో మంచి ఫేమ్ అందుకున్న నాచురల్ లుకింగ్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యినట్టు తెలుస్తుంది.
మహేష్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటరాని ఆయనలాంటి లుక్స్ ఉండడం ఎవరికీ సాధ్యం కాదని పొగడ్తల్లో ముంచేసింది. ఇంకా అలాగే మహేష్ ఫొటోస్ ను కూడా జూమ్ చేసి చూస్తానని తన స్కిన్ ఎలాంటి మచ్చ లేకుండా నీట్ గా ఉంటుంది అని కామెంట్ చేసింది. ఇది మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు మరింత కిక్కిచ్చే వార్తే అని చెప్పాలి. ఇప్పటికే సాయి పల్లవి ఓ ఫెయిర్ నెస్ కంపెనీ ఇచ్చిన భారీ డీల్ ను వదులుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరో హీరోయిన్ లు తమ సినిమాతో బిజీగా ఉన్నారు.


