లవ్‌స్టోరీలో ఆ సీన్‌పై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి..!

Published on Sep 30, 2021 3:01 am IST


అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా సెప్టెంబర్‌ 24న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సక్సెస్‌, మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ వేడుకులను కూడా జరుపుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో హీరోహీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలతో ఫుల్‌ బిజీగా మారారు. అయితే ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ ఈ సినిమాలోని ముద్దు సీన్‌పై క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాలో నేను నాగ‌చైత‌న్య‌ను ముద్దు పెట్టుకునట్టు ఓ సీన్ ఉంటుందని, కానీ అది నిజం కాదని కెమెరామెన్ ఆ స‌న్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్‌ను అలా సెట్ చేశారని అన్నారు. తాను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదని, ఏదైనా సినిమాకు డేట్స్‌ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్ల‌లో న‌టించనని తాను ముందే దర్శక నిర్మాతలకు క్లారిటీగా చెబుతానని సాయి పల్లవి చెప్పింది. ముద్దు సీన్‌లో నటించమని దర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల గారు కూడా నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని అన్నారు.

సంబంధిత సమాచారం :