యువ హీరో నితిన్ , రాశి ఖన్నా జంటగా ‘శతమానం భవతి’ ఫెమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కళ్యాణం . ఇటీవల ఆడియో వేడుకను ఘనంగా జరుపుకున్న ఈచిత్రం విడుదలకు సిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
ఇక ఈ చిత్రం లో కథానాయిక పాత్ర కోసం మొదట ‘ఫిదా’ ఫెమ్ సాయి పల్లవి ని తీసుకోవాలని ఆమె ను సంప్రదించారట. కథ విన్న సాయి పల్లవి డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లనో లేక ఈ కథ నచ్చకనో నో చెప్పిందట. దాంతో ఆమె స్థానంలో రాశి ఖన్నా ను తీసుకున్నారు.
ఆగష్టు 9న ప్రేక్షకులముందుకు రానున్న ఈ చిత్రం విజయం సాధిస్తే సాయి పల్లవి మంచి చిత్రాన్ని వదులుకున్నట్లే. ఇక ఇటీవల వరుస పరాజయాలను చవిచూసిన నితిన్ అలాగే ‘లవర్’ చిత్రం తో ప్లాప్ ను ఖాతాలో వేసుకున్న దిల్ రాజు ఈ చిత్రం ఫై చాలా ఆశలు పెట్టుకున్నారు.


