నెగిటివ్ పాత్రలో నేచురల్‌ బ్యూటీ !

Published on Jun 26, 2021 11:06 pm IST

నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ లో దూసుకెళ్తుంది. అయితే, తాజాగా మరో ప్రయోగానికి సిద్దమైంది సాయి పల్లవి. ఆమె తొలిసారి నెగెటివ్‌ రోల్‌ లో నటించబోతుందని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’లో సాయి పల్లవిది నెగిటివ్ రోల్ అట.

ఈ చిత్రంలో నాని, సాయి పల్లవితో పాటు కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. మొత్తానికి నాని 27వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని జులై నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.

కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని.. ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగుంటాయని… అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :