సాయి పల్లవితో ముచ్చటగా మూడోసారి..?

Published on Jun 19, 2021 9:02 pm IST

మోస్ట్ హ్యాపెనింగ్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఒకరు. మరి టాలీవుడ్ లోకి “ఫిదా” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆరంభమే భారీ హిట్ ను అందుకుంది. తన సినిమాలతో హీరోయిన్స్ ఫేట్ మార్చిన శేఖర్ కమ్ముల లిస్ట్ లో సాయి పల్లవి కూడా చేరింది.

ఇక ఆ చిత్రంతో మళ్ళీ నాగ చైతన్య హీరోగా ప్లాన్ చేసిన “లవ్ స్టోరీ” సినిమాకు కూడా శేఖర్ కమ్ముల సాయి పల్లవినే పిక్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ముచ్చటగా మూడోసారి కూడా ఆమెనే తన నెక్స్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ కు ఎంపిక చేస్తున్నారని టాక్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఓ పాన్ ఇండియన్ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఆ చిత్రానికే సాయి పల్లవి హీరోయిన్ గా కనిపిస్తుంది అని తెలుస్తుంది. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై సాయి పల్లవి మరియు ధనుష్ ల కాంబో సూపర్ హిట్ అయ్యింది. మరి పాన్ ఇండియన్ లెవెల్ కు ఈ కాంబో అయితే కరెక్ట్ అనుకుంటున్నారేమో అన్నది అధికారిక క్లారిటీ వచ్చే వరకు మాత్రం వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం :