చెల్లెలి ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చిన అక్క !

Published on Mar 2, 2019 5:42 pm IST

ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ బ్యూటీ సాయి పల్లవి ఆ సినిమా తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగుతో పాటు మలయాళ , తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఇక సాయి పల్లవి చెల్లెలు పూజా సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఆ వార్తల ఫై క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం పూజా ఎంబీబీఎస్ చదువుతుందని తన ద్రుష్టి అంత చదువు మీదే ఉందని ఇప్పట్లో తనకి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. ఇక పడి పడి లేచె మనసు తరువాత సాయి పల్లవి తెలుగులో ‘విరాటపర్వం 1992’ అనే చిత్రానికి సైన్ చేసింది. ఈ చిత్రంలో ఆమె, రానా కు జోడిగా నటించనుంది. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More