నాగ చైతన్య వండర్ ఫుల్ కో స్టార్ – సాయి పల్లవి

నాగ చైతన్య వండర్ ఫుల్ కో స్టార్ – సాయి పల్లవి

Published on Sep 19, 2021 11:04 PM IST

దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా వస్తోన్న సినిమా “లవ్ స్టోరి”. కాగా ఈ సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు.

కాగా ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ…చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను. అమీర్ ఖాన్ గారు ఎప్పుడూ మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటారు. నేను విభిన్నమైన క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నమ్మడమే పెద్ద బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను. ఆయన డైరెక్షన్ లో నాకిది రెండో సినిమా. ఒక్కసారి శేఖర్ కమ్ముల గారి సినిమా సెట్ కు వెళ్తే ఎంత వినయంగా పనిచేయాలో, ఎంత ఒద్దికగా ఉండాలో తెలుస్తుంది.

అదే ఎనర్జీతో నేను మిగతా చిత్రాల సెట్స్ కు వెళ్తుంటాను. ఈ టీమ్ తో మరో సినిమా వెంటనే చేయాలని కోరుకుంటున్నాను. నాగ చైతన్య వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. శేఖర్ గారి చిత్రాల్లో సమాజానికి చెప్పేందుకు ఏదో ఒక విషయం ఉంటుంది. అలాగే ఇందులో అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాళ్లంతా లవ్ స్టోరి చూశాక, ఒక ఆలోచనతో ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని మీరు వేసుకునే ఒక ప్రశ్నతో ఇంటికి వెళ్తారు. అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు