డీ గ్లామరైజ్డ్ రోల్ లో సాయి పల్లవి !

Published on May 2, 2019 8:18 am IST

రానా , సాయి పల్లవి జంటగా ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీ మరియు పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్ ప్రచారం లో వుంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి పూర్ గర్ల్ గా మేకప్ లేకుండా కనిపించనుంది. ఆమె ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించనుంది.

ఇక అలాగే రానా ఈ చిత్రంలో పొలిటికల్ లీడర్ గా కనిపించనుండగా వీరితో పాటు సీనియర్ నటి టబు మానవ హక్కుల నేతగా నటించనుందని టాక్. సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రం తెలంగాణ లోని కరీంనగర్ , వరంగల్ , సిద్దిపేట తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది.

సంబంధిత సమాచారం :

More