ఆసిన్ చేయాల్సిన సూపర్ క్యారెక్టర్ సాయి పల్లవి చేసింది

Published on Jun 7, 2021 10:36 pm IST

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సాయి పల్లవి క్రేజీ హీరోయిన్. చేసిన ఒక్కొక సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ నటి స్థాయికి ఎడిగింది సాయి పల్లవి. అయితే ఆమెకు కెరీర్ ఆరంభంలో మంచి గుర్తింపు తెచ్చింది మాత్రం ‘ప్రేమమ్’ చిత్రమే. అందులో ఆమె చేసిన మలర్ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అయింది. ఆ పాత్రకు ఇప్పటికీ చాలామంది ఫాన్స్ ఉన్నారు. అందులో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ఆమెను మలయాళం, తమిళ ఇండస్ట్రీల్లో గట్టిగా నిలదొక్కుకునేలా చేసింది. అంత మంచి పాత్రకు మొదటి ఛాయిస్ సాయి పల్లవి కాదట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు అల్ఫోన్సే పుత్రేన్ స్వయంగా బయటపెట్టారు.

మొదట కథ రాసుకునేటప్పుడు హీరోయిన్ అసిన్ ను ఊహించుకునే మలర్ క్యారెక్టర్ రాసుకున్నానని, కానీ ఆమెను కాంటాక్ట్ అవ్వడం కుదరలేదని, హీరో నవీన్ పౌలి సైతం ఆసిన్ ను సంప్రదించడానికి ట్రై చేయగా ఆమె దొరకలేదని అందుకే సాయి పల్లవికి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అలా మలర్ అనే సూపర్ క్యారెక్టర్ ఆసిన్ నుండి మిస్ అయి సాయి పల్లవికి దక్కింది. అయితే సాయి పల్లవి కూడ వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకుని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సినిమా విజయానికి కూడ ఒక కారణంగా నిలిచింది.

సంబంధిత సమాచారం :