పోస్టర్ తో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసేలా ఉంది !

Published on May 9, 2021 11:34 pm IST

నేటి జనరేషన్ లో ప్రతిభావంతమైన నటి ‘సాయి పల్లవి’ ఈ రోజు తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె హీరోయిన్ గా రానున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుండి ఈ ఉదయం ఒక ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ అయింది. పోస్టర్ లో సాంప్రదాయ బెంగాలీ చీరలో కనిపించిన సాయి పల్లవి గంభీరమైన లుక్స్ లో తీవ్రమైన తీక్షణపు చూపులతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతూ ఉంది. సహజంగా సాంగ్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసే సాయి పల్లవి, ఈ సారి పోస్టర్ తో కూడా సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేసేలా ఉంది,

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందట. కాగా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని.. ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగుంటాయని… అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి నాని 27వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి కథ: సత్యదేవ్‌ జంగా, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌.

సంబంధిత సమాచారం :