ఆర్ఎక్స్ 100 డైరక్టర్ తో యువ హీరో !

Published on Jan 3, 2019 2:32 pm IST

‘ఆర్ ఎక్స్ 100’ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అజయ్ భూపతి. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఈ చిత్రం తరువాత ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. తాజాగా ఈ డైరెక్టర్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తన రెండవ చిత్రాన్ని చేయనున్నాడు. మరి ఈ సారి అజయ్ , ఈ యంగ్ హీరోతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.

ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం తరువాత రమేష్ వర్మ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత అజయ్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More