చిరంజీవి ఫ్యాన్ ఫోన్ చేసి సినిమాలు ఆపేయమన్నాడు – సాయి తేజ్

చిరంజీవి ఫ్యాన్ ఫోన్ చేసి సినిమాలు ఆపేయమన్నాడు – సాయి తేజ్

Published on Dec 15, 2020 7:00 PM IST

Sai Dharam Tej

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటరు’ . పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. లాక్ తెరుచుకోనున్న థియేటర్లలో మోడగా విడుదలవుతున్న తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. మొదటగా సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ తర్వాత ఆడిషన్ మార్చుకుని ప్రేక్షకుల కోసం థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఓకే ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ్ కెరీర్లో తాను పడిన కష్టాలను చెప్పుకొచ్చారు.

కెరీర్ మధ్యలో వరుస పరాజయాలు పొంది ఇబ్బందులు పడిన ఆయన కెరీర్ ఆరంభంలో కూడ అలాంటి కష్టాలే అనుభవించారు. మొదటగా చేసిన సినిమా ఫైనాన్షియల్ ఇబ్బందుల వలన ఆగిపోవడం జరిగింది. మొదలుపెట్టిన రెండవ సినిమా కూడ ఏవో సమస్యల్లో చిక్కుకుంది. ఆ టైంలో సాయి తేజ్ మీద కొంత నెగెటివిటీ ఏర్పడింది ప్రేక్షకుల్లో. ఆ నెగెటివిటీ వల్లనే చిరంజీవి అభిమాని ఒకరు తనకు ఫోన్ చేసి ‘ఇక చేసింది చాలు. మీరు సినిమాలు ఆపేస్తే మంచిది’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు తేజ్.

ఆ అభిమాని మాటలకు తాను సర్.. నేను సైన్ చేసిన సినిమాలు పూర్తిచేయనివ్వండి. ఆ తర్వాత కూడ మీకు నచ్చలేదు అంటే అలాగే ఆపేస్తానని చెప్పాను. కొన్ని నెలలకు నా ఫస్ట్ ఫిలిం విడుదలైంది. అప్పుడు అదే వ్యక్తి ఫోన్ చేసి సారీ సర్. సినిమాలో మీరు బాగా చేశారు. మీరు సినిమాల్లో కొనసాగాలని మేము కోరుకుంటున్నాం అన్నాడు. అలాంటి సంఘటనలే తనను మరింత కష్టపడి ముందుకెళ్ళేలా చేస్తుంటాయని చెప్పుకొచ్చారు సాయితేజ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు