రిపబ్లిక్ కోసం సాయి తేజ్ క్రేజీ స్టెప్ !

Published on Apr 24, 2021 8:00 pm IST

మెగా మేనల్లుడు ‘సాయి ధరమ్ తేజ్’ ఇక నుండి చేయబోయే ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడట. తానూ స్వతహాగా మంచి డ్యాన్సర్ కాబట్టి.. ఇక నుండి డ్యాన్స్ లో ప్రత్యేకత చూపించాలనుకుంటున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న రిపబ్లిక్ సినిమాలో ఒక సాంగ్ లో తేజ్ నుండి అదిరిపోయే డ్యాన్స్ ఆశించొచ్చు అని తెలుస్తోంది. ఆ సాంగ్ లో ఒక డ్యాన్స్ మూవ్మెంట్ హైలైట్ గా అయ్యేలా చూసుకుంటున్నాడు తేజ్. చాల కష్టమైనా స్టెప్ ను వేశాడట.

ఎలాగూ మాస్ సాంగ్ కాబట్టి.. మంచి డ్యాన్స్ మూవ్మెంట్స్ కు మంచి స్కోప్ కూడా దొరికిందట. ఇప్పటికే జానీ మాస్టర్ ఈ సాంగ్ కోసం ఎక్కడా ఆగకుండా 55 సెకెన్ల పాటు సాగే ఒక స్టెప్ కంపోజ్ చేశాడట. ఈ స్టెప్ ఈ మధ్య వచ్చిన అన్ని స్టెప్స్ కంటే కూడా చాల కష్టమైనది అని.. మొత్తానికి క్రేజీ స్టెప్స్ లో ఈ స్టెప్ కూడా ప్రధాన హైలైట్ నిలుస్తుందని తెలుస్తోంది.

జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తుండగా ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. తేజ్ తొలిసారి రొమాంటిక్, కమర్షియల్ జానర్లను పక్కనబెట్టి చేస్తున్న సబ్జెక్ట్ కావడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం :