మరో కొత్త దర్శకుడితో మెగా హీరో ?

మరో కొత్త దర్శకుడితో మెగా హీరో ?

Published on Dec 5, 2020 10:00 PM IST

సుప్రీం హీరో సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. కాగా సాయి తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తున్నాడు. వచ్చేవారం నుండి మరో సినిమా సెట్ మీదకు వెళ్లబోతుంది. ఇవి కాకుండా ఆల్ రెడీ తాజాగా మరో కొత్త దర్శకుడి కథను ఓకే చేశాడని తెలుస్తోంది. గతంలో కృష్ణవంశీ దగ్గర పనిచేసిన రామ్ అనే డైరెక్టర్ కథ సాయి తేజ్ కి నచ్చిందని తెలుస్తోంది.

ఇక తేజు త్వరలోనే దేవా కట్టా డైరక్షన్ లో ఓ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడు. ఇక ఆ తరువాత బివివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సాయి తేజ్ మళ్లీ మరో సినిమా చేయనున్నాడు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ నటనలో మంచి మార్కులు వేయించుకున్నాడు.

ఆ మధ్యన వరుస ప్లాపులతో కాస్త ఇబ్బంది పడినా… మళ్లీ వరుస హిట్స్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అభిమానులకి దగ్గరకు ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు