మెగా హీరో సాయి తేజ్ తన తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం తేజ్ నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగానే తేజ్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అ
ఆ చిత్రాన్ని దేవ కట్టా డైరెక్ట్ చేస్తారని వినికిడి. ‘ప్రస్తానం’ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవ కట్ట తేజ్ కోసం ఒక ఇంటెన్స్ స్టోరీని సిద్దం చేశారట. అది విన్న తేజ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వచ్చే యేడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ విషయమై తేజ్, దేవ కట్టా నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.


