శైలజారెడ్డి అల్లుడు వచ్చేస్తున్నాడు !

Sailaja Reddy Alludu1

యువ సామ్రాట్ నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఆగస్టు 31న విడుదల కావల్సిన ఈచిత్రం కేరళలో రిరికార్డింగ్ పనులను జరుపుకోవడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలు ఆ పనులకు ఆటంకం కలిగించాయి. దాంతో అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. ఇక ఈ చిత్రం వినాయకచవితి రోజు సెప్టెంబర్ 13న విడుదల అవుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈసినిమా పోస్టర్లపై యు ఎస్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 12 అని ఉండడంతో ఈ చిత్రం 13వ తేదీన విడుదలకానుందని తేలిపోయింది.

ఇక అదే రోజు సమంత నటించిన ‘యు టర్న్’, సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంతకుముందు ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో కలిసి నటించిన ఈ ముగ్గురు ఇప్పుడు బాక్సాఫిస్ వద్ద పోటీ పడుతుండడం విశేషం.

Exit mobile version