యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం మొన్న విడుదలై మిక్స్ డ్ రివ్యూస్ ను తెచుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబడుతుంది. నైజాం ప్రాంతంలో ఈ చిత్రం మొదటి రోజున 1.7 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజుకి 67 లక్షలు షేర్ ను కలెక్ట్ చేసింది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం ఏరియాకి 4.5 కోట్ల వరకు విక్రయించబడింది. ఆ మొత్తం వస్తే గాని ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉందా ? లేదా ? అని చెప్పలేము. అయితే ఇప్పుడు వస్తోన్న కలెక్షన్స్ ప్లో ఇలాగే రెండు మూడు రోజులు కొనసాగితే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సేఫ్ అయినట్లే.
ఇక ఈ చిత్రం అటు ఓవర్శిస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది. మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రంలో చైతుకి జోడిగా అనూ ఇమాన్యుల్ నటించగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ శైలజారెడ్డి పాత్రలో కనిపించింది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.


