శైలజారెడ్డి అల్లుడు గురించి అంతా పాజిటీవ్ గానే ఉంది !

Published on Sep 9, 2018 4:45 pm IST


చిన్న చిన్న పాయింట్లు తీసుకోని, ఆ పాయింట్లకి హాస్యంతో కూడిన ట్రీట్మెంట్ ని నింపేసి.. ఫైనల్ గా సినిమాని హిట్ చెయ్యడంలో దర్శకుడు మారుతి దిట్ట అనే చెప్పాలి. అలా వచ్చినవే ‘భలే భలే మగాడివోయ్ ‘మహానుభావుడు’ చిత్రాలు. ఇప్పుడు నాగ చైతన్య హీరోగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా అదే కోవకు చెందిన సినిమా అట. ఈ సినిమాలో ప్రధానంగా మారుతి ‘ఇగో’ అనే పాయింట్ ని బేస్ చేసుకోని, సినిమాని అత్యంత కామెడీగా మలిచారని తెలుస్తోంది. సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలవ్వబోతున్న ఈ చిత్రం పై అక్కినేని అభిమానులతో పాటుగా సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి అంచనాలను చైతు – మారుతి కాంబినేషన్ అందుకుంటుదని ఫిల్మ్ వర్గాల్లో పాజిటీవ్ టాక్ ఉంది.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం.. రమ్యకృష్ణ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తోందని చిత్ర యూనిట్ కి సంబంధించిన వ్యక్తులు నమ్మకంగా చెప్తున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణకి చైతుకి మధ్య సాగే సాన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని, అలాగే ఎమోషనల్ గానూ చిత్రంలో మారుతి మంచి పాయింట్ ని టచ్ చేశారని.. ఖచ్చితంగా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ‘శైలజారెడ్డి అల్లుడు’ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :