ప్రస్తుతం మన టాలీవుడ్ లో షైన్ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మరి వారిలో తమ గ్లామ్ షో తో కూడా ఆకట్టుకునే యంగ్ హీరోయిన్స్ ఉండగా వారిలో లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “సైంధవ్” చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన యంగ్ హీరోయిన్ రుహాణి శర్మ కూడా ఒకరు. మరి రుహాణి శర్మ లేటెస్ట్ గా అయితే తన సెల్ఫీ పిక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది అని చెప్పాలి.
తాను రీసెంట్ గా షేర్ చేసిన కొన్ని సెల్ఫీ పిక్స్ లో క్రేజీ అవుట్ ఫిట్ తో యువత మైండ్ బ్లాక్ చేసింది. దీనితో ఈ పిక్స్ బయటకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో యిట్టె వైరల్ అయ్యిపోయాయి. ఇలా తన లేటెస్ట్ పిక్స్ తో రుహాణి శర్మ హాట్ టాపిక్ గా మారింది. ఇక రుహాణి శర్మ రీసెంట్ గా సైంధవ్ సహా హెర్, హిట్ 2 తదితర చిత్రాల్లో కనిపించింది. అలాగే మరిన్ని చిత్రాల్లో ఆమె నటిస్తుంది.


