తిరుమలేశుడిని దర్శించుకున్న హీరో హీరోయిన్లు !

Published on Jul 26, 2018 10:58 am IST

శ్రీవాస్ దర్శత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సంధర్బంగా చిత్ర హీరోహీరోయిన్లు సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే సాక్ష్యం’ చిత్రబృందంతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్ట్రర్లు, టీజర్ లతో పాటు ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అభిషేక్ పిక్చర్స్ పతాకం పై రూపొందింది.

సంబంధిత సమాచారం :