సీడెడ్ లో “సలార్” ఫస్ట్ వీక్ సెన్సేషనల్ వసూళ్లు.!

సీడెడ్ లో “సలార్” ఫస్ట్ వీక్ సెన్సేషనల్ వసూళ్లు.!

Published on Dec 29, 2023 1:00 PM IST

Salaar 2

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మరో స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు అనేక చోట్ల నమోదు చేసింది.

ఇక తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం ఫస్ట్ వీక్ రన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోగా అందులో ఈ చిత్రం సీడెడ్ లో మొదటి వారం సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. పి ఆర్ నంబర్స్ ప్రకారం సలార్ మొదటి వారం సీడెడ్ మార్కెట్ లో ఏకంగా 18 కోట్ల షేర్ ని అందుకుంది. దీనితో సలార్ మొదటి వారం అదరగొట్టింది అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో అయితే ఎక్కడ ఆగుతుందో చూడాలి.

తాజా వార్తలు