‘సలార్’ అనేది కేవలం ఒక ట్రయల్ మాత్రమేనా ?

Published on Jun 9, 2021 7:10 pm IST

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడు అనేదే అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇది కూడ భారీ బడ్జెట్ చిత్రమే. అయితే నిజానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేయాలనుకున్న సినిమా ఇది కాదట. మొదటగా వీరిద్దరూ ‘బాహుబలి’కి మించిన సినిమా చేయాలని అనుకున్నారట. బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ప్రభాస్ కలిసి వర్క్ చేయాలని చాలా కాలం నుండి అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ప్రశాంత్ నీల్ వీరితో చేతులు కలపడం జరిగింది.

‘బాహుబలి’తో ఇండియా లెవల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ను ఇంకో మెట్టు పైకెక్కించేలా ప్రశాంత్ నీల్ ఒక మైథలాజికల్ స్టోరీని చెప్పారట. కథ కూడ ప్రభాస్, దిల్ రాజులకి నచ్చిందట. అయితే అంత పెద్ద సినిమాను కమిట్ అయ్యేముందు టైమ్ ఉంది కాబట్టి ఈలోపు ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామని ప్రభాస్ సజెస్ట్ చేయడంతో ప్రశాంత్ నీల్ అంగీకరించి ‘సలార్’ కథను సిద్ధం చేసి వినిపించారని, అది నచ్చి ప్రభాస్ వెంటనే ఓకే చెప్పడం, సినిమా మొదలవడం జరిగిపోయిందట. సో.. ‘సలార్’ అనేది ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలయికకు జస్ట్ శాంపిల్ మాత్రమే అనుకోవచ్చు.

సంబంధిత సమాచారం :