ఇట్స్ అఫీషియల్..”సలార్”లో హీరోయిన్ గా ఈ స్టార్ హీరోయిన్.!

Published on Jan 28, 2021 10:10 am IST

లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. జస్ట్ ప్రకటన తోనే ఇండియన్ సినిమాలో భారీ హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రంలో గత కొన్ని రోజుల నుంచి క్యాస్టింగ్ పరంగా కొన్ని గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో అయితే గట్టి బజ్ నే వినిపించింది.

స్టార్ హీరోనే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది అన్న టాక్ నిజం నిజం చేస్తూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చేసారు. తమ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సలార్ లోకి శృతి హాసన్ కు వెల్కమ్ చెబుతూ ఆమెకు బర్త్ డే విషెష్ ను తెలిపారు. సో ఇప్పటికి ఈ సస్పెన్సు వీడింది అని చెప్పాలి. మరి మిగతా క్యాస్టింగ్ కు సంబంధించి ఎప్పుడు అప్డేట్స్ వదులుతారో చూడాలి. అలాగే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రేపటి నుంచే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :

More