రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. నాల్గో రోజు సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. నాల్గో రోజు 18 కోట్ల రూపాయలకి పైగా షేర్ ను రాబట్టడం జరిగింది. ఇది ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్.
ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


