భారీ యాక్షన్ సీక్వెన్స్ తో అక్కడ షూట్ లో “సలార్”.!

Published on Jan 27, 2021 4:01 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. కన్నడా స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తాలుకా షూట్ ను కూడా మేకర్స్ ఇటీవలే స్టార్ట్ చేశారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తోనే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా గోదావరిఖని మైనింగ్ ప్రాంతంలో కొన్ని కీలక సెట్టింగ్స్ వేసి భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అంతే కాకుండా మరిన్ని సన్నివేశాలు కూడా కొన్ని బొగ్గు గని ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటాయని కూడా తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించి హీరోయిన్ పై కూడా కొన్ని రోజుల్లో క్లారిటీ రానున్నట్టు కూడా వినికిడి. ఇక ఈ చిత్రాన్ని కూడా కేజీయఫ్ నిర్మాతలు హోంబలే వారే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :