ప్రభాస్ “సలార్”లో శ్రుతి హాసన్ రోల్ అదే !

Published on Apr 19, 2021 6:54 am IST

కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయిందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రుతి హాసన్ ఈ సినిమా వచ్చే షెడ్యూల్ షూట్ లో పాల్గొనబోతుంది. ఒక జర్నలిస్ట్ పాత్రలో శ్రుతి హాసన్ ఈ సినిమాలో కనిపించబోతుంది. అలాగే ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా సినిమాలో హైలైట్ గా ఉంటుందట.

కాగా హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశారట. 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. ప్రభాస్ సలార్ కోసం బల్క్ డేట్స్ ను కేటాయించనున్నాడు. కాగా ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :