మళ్ళీ యాక్షన్ తోనే స్టార్ట్ చేయనున్న “సలార్”.!

Published on Apr 9, 2021 8:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పై చాలానే స్పెక్యులేషన్స్ ఉన్నా షూట్ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా షెడ్యూల్ ప్రకారం నడిచిపోతుంది.

అలా మొట్ట మొదటి షెడ్యూల్ ను ఆ మధ్య అదిరే యాక్షన్ సీక్వెన్స్ తో గోదావరిఖనిలో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండో షెడ్యూల్ లో కూడా మరో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తోనే స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షెడ్యూల్ గుజరాత్ లో నెల రెండు కానీ మూడో వారంలో స్టార్ట్ కానుందట. ఇక ఈ చిత్రానికి దాదాపు కేజీయఫ్ టెక్నీకల్ టీం నే పని చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :