ఇద్దరు స్టార్ హీరోలు రెండు సీజన్లో తమ చిత్రాలలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు. క్రిస్మస్ మరియు రంజాన్ పండుగలకు ఈఇద్దరు స్టార్ హీరోలు తమ చిత్రాలు విడుదల చేస్తున్నారు. వారెవరో కాదు, సల్మాన్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్ మూవీ దబాంగ్ 3 తో పోటీపడుతుండగా, లక్ష్మీ బాంబ్ చిత్రం రంజాన్ కానుకగా రానున్న రాధే చిత్రంతో పోటీకి సిద్ధమైంది.
ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న దబాంగ్ 3 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల అవుతుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు కూడా. అలాగే రాజ్ మెహతా దర్శకత్వంలో అక్షయ్ నటిస్తున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘గుడ్ న్యూస్’ చిత్రం కూడా క్రిస్మస్ సీజన్లోనే విడుదల కానుందని సమాచారం. అలాగే వచ్చే ఏడాది రంజాన్ కానుకగా సల్మాన్ ‘రాధే’ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, తమిళ కాంచన చిత్రానికి హిందీ రీమేక్ గా వస్తున్న ‘లక్ష్మీ బాంబ్’ చిత్రాన్ని అక్షయ్ విడుదల చేయనున్నారు. ఇలా రెండు సీజన్లలో బాలీవుడ్ టాప్ హీరోలు పోటీకి సిద్ధమయ్యారు.


