ముగ్గురు సూపర్ స్టార్ లు ఒకే చిత్రంలో…!

ముగ్గురు సూపర్ స్టార్ లు ఒకే చిత్రంలో…!

Published on Nov 2, 2019 8:39 AM IST

three

బాలీవుడ్ లో ఖాన్ త్రయంగా పేరుగాంచిన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ స్టార్ హీరోలుగా గత కొన్ని దశబ్దాలుగా కొనసాగుతున్నారు. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్స్ గా ఎదిగిన వీరు, అనేక సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేశారు. కాగా ఈ ముగ్గురు ఒకే చిత్రంలో కలిసి నటించనున్నారా..?అంటే అవుననే అంటున్నారు కొందరు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో సల్మాన్ మరియు షారుక్ లు కూడా కనిపించనున్నారట.

అమీర్ కొన్ని నెలల ముందు తాను లాల్ సింగ్ చద్దా అనే చిత్రాన్ని చేస్తున్నట్లుగా ప్రకటించారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సీక్రెట్ సూపర్ స్టార్ దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో కొద్దినిమిషాలు కనిపించే ప్రాముఖ్యం ఉన్న పాత్రలో షారుక్ ని నటించవలసినదిగా కోరగా ఆయన ఒప్పుకున్నారట. ఇక సల్మాన్ కి కూడా అలాంటి పాత్రే లాల్ సింగ్ చద్దా చిత్రంలో డిజైన్ చేశారట. ఐతే సల్మాన్ ఈ చిత్రంలో నటించే విషయమై ఇంకా ఎటువంటి సంకేతాలు ఇవ్వలేడదని సమాచారం. సల్మాన్ కూడా ఒప్పుకుంటే ఈ మూవీలో ఖాన్ త్రయం ముగ్గురిని చూడవచ్చు.

తాజా వార్తలు