ఆ అగ్ర దర్శకుడితో సల్మాన్ 2020 రంజాన్ మూవీకి రంగం సిద్ధం.

Published on Jun 7, 2019 12:19 pm IST

సల్మాన్ ఖాన్ “భారత్” మూవీ విజయం తో మరో మారు రంజాన్ హీరోగా తనసత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో ఈ మూవీ రికార్డు వసూళ్లు దిశగా దూసుకుపోతుంది. సల్మాన్ సరసన కత్రినా, దిశా పటాని నటించిన ఈ మూవీని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు.

సల్మాన్ ఫ్యాన్స్ ‘భారత్’ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే ఆయన తదుపరి రంజాన్ మూవీ గురించి ఓ శుభవార్త బయటకొచ్చింది. బాలీవుడ్ అగ్రదర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో, అలియా భట్ హీరోయిన్ గా ‘ఇన్షా అల్లా’ అనే మూవీని చేయనున్నారట.ఈ విషయాన్ని యంగ్ హీరోయిన్ అలియా భట్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది.

ఈ అగ్ర దర్శకుడు గతంలో దేవదాస్, బాజీరావ్ మస్తానీ పద్మావతి వంటి భారీ ఎపిక్ మూవీస్ కి దర్శకతం వహించారు. ఈ మూవీ 2020 రంజాన్ కానుకగా విడుదల కానుందంట. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ ని సల్మాన్ ,బన్సాలి కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారట.

సంబంధిత సమాచారం :

More