సల్మాన్‌కు బెయిల్ దొరికింది !


1998 అక్టోబర్ 2న రెండు కృష్ణ జింకలో వేటాడి చంపిన కేసులో 20 ఏళ్ల విచారణ అనంతరం జోధ్ పూర్ కోర్టు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తీర్పు అనంతరం సల్మాన్ జైలుకు కూడా వెళ్లారు. ఆ రోజు నుండి సల్మాన్ లాయర్ల బృందం బెయిల్ కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

6వ తేదీనాడే విచారణకు వచ్చిన సల్మాన్ బెయిల్ పిటిషన్ ఈ రోజుకు వాడిదాపడింది. ఈ వాయిదాలోనే జోధ్ పూర్ కోర్టు రూ.50,000 పూచీకత్తుపై ఈ హీరోకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 48 గంటల పాటు జైలు శిక్ష అనుభవించిన సల్మాన్ ఇంకొద్దిసేపట్లో బయటకురానున్నారు. సల్మాన్ కు బెయిల్ దొరకడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.