హై బడ్జెట్ తో సల్మాన్ బిగ్ పాన్ ఇండియన్ ఫ్లిక్.?

Published on Aug 16, 2021 12:01 am IST

ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యగలిగే బాలీవుడ్ స్టార్ హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. ఇపుడు అంటే సరైన హిట్ లేదు కానీ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక ఇదిలా ఉండగా సల్మాన్ లైనప్ పై ఇప్పుడు ఆసక్తికర ఇన్ఫో వినిపిస్తుంది.

మరి తాజా బజ్ ప్రకారం సల్మాన్ ఒక హై బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అది కూడా తన ప్రొడక్షన్ లోనే ఉండనున్నట్టుగా టాక్.. అయితే దీనిపై మరింత సమాచారం ఏమిటంటే ఇది ఒక భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుందని తెలుస్తుంది.

అంతే కాకుండా ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ చేసినట్టు టాక్. సల్మాన్ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా గ్రాండ్ ఆలోచనలో ఉన్నాడట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే సల్మాన్ మన దగ్గర మెగాస్టార్ చిరు నటిస్తున్న నెక్స్ట్ చిత్రం లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడని టాక్ ఉంది. అది ఎంతమేర నిజం కానుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :