అత్యంత భారీగా తెరకెక్కబోతున్న స్టార్ హీరో సాంగ్‌

Published on Aug 5, 2018 2:32 pm IST

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా కత్రినా కైఫ్‌ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భారత్‌’. కాగా ఈ చిత్రంలో దిశా పటాని కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్ సర్కస్‌ ఆర్టిస్టుగా నటిస్తుండటం విశేషం. అందుకోసం ప్రస్తుతం సల్మాన్‌ జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తోన్నారట. దిశా పటాని కూడా సర్కస్‌ ఆర్టిస్టుగానే నటిస్తోంది.

కాగా భారత్ లో సల్మాన్‌ఖాన్‌ బాగా ఫీట్స్‌ చేయనున్నారు. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం భారత్ లోని సల్మాన్‌ ఇంట్రో సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సాంగ్‌ చిత్రీకరణలో దిశా పటాని కూడా పాల్గొంటున్నారు. అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఈ సాంగ్‌ కోసం ఐదు వందలమందిదాకా డ్యాన్సర్స్‌ పాల్గొనబోతున్నారట.

సంబంధిత సమాచారం :

X
More