సల్మాన్ స్టామినా..’రాధే’ మొదటిరోజు రూ.100 కోట్లు !

Published on May 15, 2021 2:00 am IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘రాధే’ జీ ఓటీటీ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే. పే పర్ వ్యూ పద్దతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది జీ సంస్థ. ఈ పద్ధతిలో విడుదలైన మొదటి భారీ చిత్రం ఇదే. పైగా సల్మాన్ ఖాన్ సినిమా అందులోనూ ఈద్ రోజున కావడంతో అభిమానులు, ప్రేక్షకులు భారీ స్థాయిలో సినిమాను వీక్షించారు. విడుదలై 24 గంటలు కూడ గడవకముందే 42 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చూసుకుంది ఈ చిత్రం.

మొదటిరోజు బిజినెస్ ద్వారా జీ సంస్థ రూ.100 కోట్ల వరకు బిజినెస్ చూసిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బిజినెస్ అంతా కొత్త సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ ద్వారానే సాధ్యమైంది. ఈ పే పర్ వ్యూ పద్దతిలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షేర్స్ లాంటివి ఏవీ లేవు. మొత్తం జరిగిన బిజినెస్ అంతా జీ ఓటీటీ ఖాతాలోకే వెళుతుంది. అంటే జీ సంస్థ భారీ లాభాల్ని చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ‘రాధే’ బిజినెస్ చూస్తే ఓటీటీల హవా పెరిగిన నేపథ్యంలో ఈ పే పర్ వ్యూ పద్దతి కొత్త తరహా ఒరవడికి శ్రీకారం చుట్టబోతుందని అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :