సల్మాన్ ట్వీట్ కి బన్నీ రీట్వీట్ !

Published on Apr 26, 2021 4:43 pm IST

డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, దిశాపటాని హీరోయిన్‌గా రానున్న సినిమా ‘రాధే’. ఈ రంజాన్ కి ‘రాధే’ని విడుదల చెయ్యాలని సల్మాన్ ఫిక్స్ అయి ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మే 13న థియేటర్స్‌లోనూ అలాగే ఓటీటీలో ఒకేసారి ప్రేక్షకుల ముదుకు రాబోతోంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా సీటీమార్ సాంగ్ రిలీజ్ అయింది.

కాగా రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సీటీమార్ సాంగ్‌కి మ్యూజిక్ అందించాడు. ఈ సాంగ్ తెలుగులో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోనిది. అల్లు అర్జున్ – పూజా హెగ్డే స్టెప్స్ అదిరిపోయాయి. కాగా ‘ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ డాన్స్, స్టైల్ అద్భుతం..చాలా చాలా నచ్చింది..థాంక్యూ బ్రదర్’.. అంటూ సల్మాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ ట్వీట్‌కి అల్లు అర్జున్ స్పందిస్తూ ‘థాంక్యూ సల్మాన్ గారు.. మీ నుంచి కాంప్లిమెంట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. మీ రాధే సినిమా పెద్ద హిట్ అవాలి..మ్యాజిక్ క్రియేట్ చేయాలి’.. అంటూ రీ ట్వీట్ చేశాడు. ఈ సినిమాని అటు థియేటర్లోనూ, ఇటు జీ ప్లెక్స్ కి చెందిన స్ట్రీమింగ్ సైట్ లో ‘పే పర్ వ్యూ’ పద్దతిలో సినిమాని చూడొచ్చు.

సంబంధిత సమాచారం :