టాక్ తో సంబంధం లేకుండా దంచేసిన భాయ్.!

Published on May 19, 2021 8:14 am IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే”. స్టార్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్ గా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గత వారమే నేరుగా జీ ప్లెక్స్ లో డిజిటల్ రిలీజ్ కాబడింది. అయితే ఫ్రీ గా కాకుండా పే పర్ వ్యూ గా విడుదల కాబడిన ఈ చిత్రం మొదటి రోజే దుమ్ము లేపింది.

అలాగే మొదటి గంట అయితే భాయ్ దెబ్బకు జీ ప్లెక్స్ అండ్ జీ 5 క్రాష్ అయ్యిపోయాయి కూడా..తర్వాత సినిమా బాగాలేదు అని టాక్ రావడం ఓవర్ గా ఉందని బ్యాన్ చెయ్యాలని నెగిటివ్ టాక్స్ వచ్చినా వాటితో సంబంధం లేకుండా జీ ప్లెక్స్ లో మొదటి వారాంతం భాయ్ దంచేసాడట. ఫస్ట్ వీకెండ్ కే సల్మాన్ రాధే ఏకంగా 9.9 మిలియన్ పే పర్ వ్యూస్ ను దక్కించుకుందట.

ఇది మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. అంత నెగిటివిటీలో కూడా భాయ్ చిత్రం ఈ రేంజ్ వ్యూస్ అందులోని డబ్బులు పెట్టి చూడటం అంటే సల్మాన్ కే చెల్లింది అని చెప్పాలి. అలాగే ఈ వ్యూస్ తోనే దాదాపు 250 కోట్లు మేర ఈ చిత్రానికి వచ్చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సల్మాన్ చిత్రం ఓ రేంజ్ లో అదరగొట్టిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :