డబ్బులతో కూడా భారీ వ్యూవర్ షిప్స్ కొల్లగొట్టిన “రాధే”.!

Published on May 15, 2021 8:45 am IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం “రాధే” రికార్డు మీద రికార్డు కొడుతుంది. టాక్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ స్ట్రీమింగ్ లో ఓపెనింగ్ డే భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. ప్లెక్స్ మరియు జీ 5 లో పే పర్ వ్యూ కాన్సెప్ట్ తో విడుదల కాబడిన ఎవరూ ఊహించని విధంగా సిల్వర్ స్క్రీన్ పై ఎలా అయితే వసూళ్లు వస్తాయో అలా మొదటి రోజే 100 కోట్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది.

మరి ఇదే అనుకుంటే డబ్బులు పెట్టి చూడడంలో కూడా భాయ్ సినిమా రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 4.2 మిలియన్ మంది పే పర్ వ్యూ ద్వారా చూశారట. అంటే సల్మాన్ రాధే కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూసారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో సల్మాన్ సరసన స్టార్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్ గా నటించగా ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :