పద్నాలుగు సెంచరీలు కొట్టిన ఏకైక సూపర్ స్టార్.

Published on Jun 9, 2019 11:19 am IST

సూపర్ స్టార్ సల్మాన్ “భారత్” మూవీతో అరుదైన రికార్డును సాధించారు. భారత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను వసూళ్లతో షేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల మేజిక్ ఫిగర్ ని క్రాస్ చేసిందని సమాచారం. దీనితో 14 సార్లు ఈ వందకోట్ల క్లబ్ చేరిన హీరోగా ఆయన రికార్డు సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా సల్మాన్ కి అభిమానులున్నారు. దానితో సల్మాన్ నుండి వచ్చిన యావరేజ్ మూవీ కూడా ఈజీ గా ఈ వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది.

గతంలో సల్మాన్ చేసిన దబాంగ్,ఏక్ తా టైగర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో,దబాంగ్ 2,టైగర్ జిందా హై, రెడీ,బాడీ గార్డ్,జయహో,భజరంగి భాయ్ జాన్,కిక్,ట్యూబ్ లైట్,సుల్తాన్ , రేస్ 3 ఈ వంద కోట్లు లేదా అంతకు మించిన వసూళ్లను సాధించాయి. 2020 ఈద్ మూవీ ని కూడా సల్మాన్ లైన్లో పెట్టారు. ప్రముఖ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి “ఇన్షాల్లా” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో సల్మాన్ సరసన అలియా నటించనుంది.

సంబంధిత సమాచారం :

More