గార్డ్ పై చేయిచేసుకున్న సల్మాన్…ఎందుకంటే…!

Published on Jun 6, 2019 9:09 am IST

సల్మాన్ తన వ్యక్తిగత సిబ్బంది పై చేయిచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నిన్న విడుదలైన “భారత్” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ముంబై లోని ఓ ధియేటర్ వద్ద నుండి పబ్లిక్ లో నడుచుకుంటూ వెళుతున్న సల్మాన్ ఒక్కసారిగా వెనక్కితిరిగి తన గార్డ్ చెంప చెళ్లుమనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఐతే సల్మాన్ సదరు సెక్యూరిటీ గార్డ్ పై చేసుకోవడం వెనుక కారణం ఏమిటంటే, ఆ గార్డ్ సల్మాన్ అభిమాని అయిన ఓ బాలుడిని కొట్టడంతో అది చూసిన సల్మాన్ అలా రియాక్ట్ ఐయ్యారట. ఈ సంఘటనపై సోషల్ మీడియా లో మిశ్రమ స్పందన వస్తుంది. అతను తన విధిలో బాగంగానే అభిమానిని కొట్టాడు కదా అని సల్మాన్ ని కొందరు తప్పుపడుతుంటే, కొందరు మాత్రం అభిమానులపై సల్మాన్ కి ఉన్న ప్రేమకి, స్పందించిన తీరుకి ముగ్దులు అవుతున్నారట.

సంబంధిత సమాచారం :

More