సల్మాన్ “భారత్”కి అదిరిపోయే రేటింగ్ ఇచ్చిన ప్రముఖ విశ్లేషకుడు

Published on Jun 5, 2019 9:25 am IST

సూపర్ స్టార్ సల్మాన్, కత్రినా ఖైఫ్ ల లేటెస్ట్ సెన్సేషన్ “భారత్” , రంజాన్ సంధర్బంగా నేటినుండి థియేటర్స్ లో సందడి చేయనుంది. 2014 లోవచ్చిన సౌత్ కొరియన్ మూవీ”ఓడ్ టు మై ఫాదర్” మూవీని దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ హిందీలో రీమేక్ చేశారు.రంజాన్ సంధర్బంగా విడుదలైన సల్మాన్ గత చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేయడంతో ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి.

నిన్ననే ఈ మూవీ ప్రీమియర్స్ విదేశాలలో ప్రదర్శించడంతో ప్రముఖ బాలీవుడ్ చిత్రాల విశ్లేషకుడు, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ మూవీ పై తన స్పందన తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ఈ మూవీ పై ప్రశంసల జల్లు కురిపించారు. “భావోద్వేగమైన ప్రయాణానికి సల్మాన్ జీవంపోశారు. ఆయన నటన అసాధారణం, కత్రినా నటన అద్భుతం, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ వినోదాన్ని భావోద్వేగాలను మిళితం చేసి చక్కగా తెరకెక్కించారు. కొంచెం సినిమా లెన్త్ ఎక్కువైంది” అని ఆయన తెలిపారు. ఓవర్ అల్ గా మూవీకి నాలుగు స్టార్స్ ఇచ్చి సల్మాన్ ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ అనే సందేశం పంపారు. మరి ఈయన విశ్లేషణ ఎంతవరకు కరెక్టో ఇంకొన్ని గంటలలో తేలనుంది.

సంబంధిత సమాచారం :

More