జక్కన్న హీరోయిన్ కి ఎట్టకేలకు లక్ తగిలిందిగా.

Published on Sep 1, 2019 12:04 am IST

హీరోయిన్ సలోనికి అందం అభినయం ఉన్నా లక్కు కలిసిరాలేదు. 2003లో వచ్చిన దిల్ పరదేశి హోగయా చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఆ చిత్రం తరువాత తెలుగులో సుమంత్ సరసన ధన51 లో నటించారు. ఆ చిత్రం పరాజయం పాలైంది. ఆ తరువాత ఆమె చేసిన ఒక ఊరిలో, చుక్కలో చంద్రుడు అన్ని వరుస పరాజయాలు చవిచూశాయి.

ఆమె తెలుగులో హీరోయిన్ గా చేసిన చిత్రాలలో రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా విడుదలైన మర్యాద రామన్న మాత్రమే విజయం సాధించింది. ఇటీవల ఆమె రేసు గుర్రం, బాడీ గార్డ్ వంటి చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఫేడ్ అవుట్ అవుతున్న దశలో ఆమెకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది.

బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న మిస్టర్ రావణ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఆమె దక్కించుకుంది. ఈచిత్రానికి సంబందించిన ప్రకటన నేడు జరిగింది. సలోనితో పాటు తెలుగు తమిళ చిత్రాలలో విలన్ గా చేసిన అనూప్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హిందీ,తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది. ధన్రాజ్ నిర్మించి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకెళ్లనుంది. మరి ఈ చిత్రమైన ఆమెకు మంచి విజయం చేకూర్చి పరిశ్రమలో నిలబడేలా చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :