రానా ప్రీ వెడ్డింగ్ వేడుకలో చైతూ-సమంత సందడి

Published on May 22, 2020 8:58 am IST


రానా తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో ప్రీ వెడ్డింగ్ వేడుక జరుపుకున్నారు. ఈ వేడుక ద్వారా మిహికతో తన వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. రానా సైతం ట్విట్టర్ లో ఇక మా బంధం అధికారికం అని ట్వీట్ చేయడం జరిగింది. కేవలం సన్నిహితుల సమక్షంలో రానా, మిహికా ఈ వేడుక జరుపుకున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనుందని సమాచారం. సురేష్ బాబు సైతం వీరిద్దరి పెళ్లి 2020లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. నిశ్చితార్ధ కార్యక్రమం సింపుల్ గా ముగించినా పెళ్లి ఘనంగా జరపాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో ఉన్నారు.

ఈ నిశ్చితార్ధ వేడుకలో టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య-సమంతల జంట ప్రత్యేకంగా నిల్చింది. వీరిద్దరూ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. చైతన్య రామానాయుడికి స్వయానా మనువడు కాగా రానాకు బావమరిది వరుస అవుతాడు. చాలా కాలం తరువాత ఓ వేడుకలో కనిపించిన చై, సామ్ వేడుకకు మరింత శోభను తెచ్చారు. చైతు ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీ చేస్తుండగా, సమంత తెలుగులో కొత్త చిత్రాలు వేటికి సైన్ చేయలేదు.

సంబంధిత సమాచారం :

More