మరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో ‘సమంత’ !

మరో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలో ‘సమంత’ !

Published on Sep 25, 2018 10:07 PM IST

తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ అయిన సరే, ఆమెకు పెళ్లి అయితే ఇక ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకుంటారు. కానీ అక్కినేని సమంతకి ఈ నియమం వర్తించదు. ఎందుకంటే పెళ్లి తరువాత కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటున్నారు. కాగా తాజాగా సమంత ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూ టర్న్‌ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

తాజగా సినీవర్గాల సమాచారం ప్రకారం సమంత మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు తెరకు లేడీ దర్శకురాలుగా పరిచయమైన నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత తన తదుపరి చిత్రం చేయనుందట. నందిని చెప్పిన కథ సమంతకు విపరీతంగా నచ్చిందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు