స్టార్ బ్యూటీ సమంత లీడ్ పాత్రలో దర్శకురాలు నందిని రెడ్ది కలయికలో మూడోసారి చేసిన సినిమానే మా ఇంటి బంగారం. సాలిడ్ ఎమోషన్స్ మరియు యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే మంచి రెస్పాన్స్ అందుకొని భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇలా రెండు రోజల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపింది.
మొదటి రోజు 13 కోట్లకి పైగా గ్రాస్ రాబడితే రెండో రోజు 15 కోట్ల జంప్ తో మొత్తం 28 కోట్లకి పైగా గ్రాస్ ని మా ఇంటి బంగారం రాబట్టి బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది అని చెప్పాలి. ఇక రెండో రోజే ఇలా ఉంటే మూడో రోజు ఆదివారం కూడా స్ట్రాంగ్ బుకింగ్స్ ని సినిమా కనబరుస్తుంది. దీనితో మూడో రోజు అంతకు మించి వసూళ్లు వచ్చినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే హీరోయిన్ సమంతనే నిర్మాణం వహించడం జరిగింది.


