ఎన్టీఆర్-సమంత ఐదోసారి..?

Published on Feb 25, 2020 11:58 am IST

ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతుంది. హైదరాబాద్ వేదికగా రాజమౌళి ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ తన 30వ చిత్రం క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ప్రకటించేశారు. మే నెల నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో గతకొద్దిరోజులుగా విపరీతమైన చర్చ నడుస్తుంది.త్రివిక్రమ్ మళ్ళీ పూజ హెగ్డే నే తీసుకుంటున్నారు అని కొందరు అంటుంటే లేదు..ఈసారి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి జోడిగా రష్మిక మందనాను ఎంపిక చేయనున్నారు అంటూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కాగా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదేమిటంటే త్రివిక్రమ్ మరోమారు ఎన్టీఆర్ కి జంటగా సమంత ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉండగా ఒక హీరోయిన్ గా సమంతను తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో వచ్చే 5వ చిత్రం అవుతుంది. మొదటిసారి బృందావనం సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ తరువాత రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్, రభస చిత్రాలలో కలిసి నటించారు.

సంబంధిత సమాచారం :

X
More