స్పెయిన్ వెకేషన్ లో చైతు,సామ్…!

Published on Aug 31, 2019 9:46 pm IST

నాగార్జున ప్రత్యేకమైన తన 60వ పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడానికి స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తన కుటుంబ సభ్యులైన అమల, నాగచైతన్య, అఖిల్, సమంత లతో పాటు కొందరు సన్నిహితులతో కలిసి స్పెయిన్ లో గల ఐబిజా ఐలాండ్ కి వెళ్లడం జరిగింది. అక్కడ నాగ్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న వీరు ఆ ఐలాండ్ లో సరదాగా గడుపుతున్నారు.

నాగ్ కోడలు సమంత అక్కడ వారరు సరదాగా గడుపుతున్న చిత్రాలకు సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ తన అభిమానులకు ఆహ్లాదం కలిగిస్తున్నారు. తాజాగా సమంత భర్త నాగ చైత్యతో దిగిన ఓ ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యంగ్ కపుల్ కలిసి దిగిన ఆ ఫోటో చూసిన అందరూ జంట ముచ్చటగా ఉందని కితాబు ఇస్తున్నారట.

సంబంధిత సమాచారం :