సమంతతో పెళ్లి అయ్యాక వచ్చే సన్నివేశాలే హైలెట్ !

సమంతతో పెళ్లి అయ్యాక వచ్చే సన్నివేశాలే హైలెట్ !

Published on Feb 28, 2019 3:00 AM IST

Samantha2

జీవితంలో అలాగే ప్రేమలో కూడా ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక మంచి అమ్మాయి భార్యగా వస్తే..? అతనికి ఎలా ఉంటుందో తెలియదు గాని, ఆ అమ్మాయికి మాత్రం టార్చర్ కనబడుతుంది.

అయితే ఆ అమ్మాయి కారణంగా అతని లైఫ్ ఎలా మారుతుంది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదుగుతాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ, సమంత – నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా మజిలీ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు.

అయితే ఈ సినిమాలో చైతు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందట.. పైగా ఆయన కెరీర్ లోనే ఇలాంటి క్యారెక్టర్ ఇదివరకూ ఎప్పుడు చెయ్యలేదట. ముఖ్యంగా సమంతతో పెళ్లి అయ్యాక చైతుకి సంబంధించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు