పులితో తారక్ ఫైట్ పై సమంత కీలక వ్యాఖ్యలు!

Published on Dec 9, 2021 8:04 pm IST


తాజాగా విడుదలైన రౌద్రం రణం రుధిరం ట్రైలర్ పై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు సమంత కూడా చేరిపోయింది. ఈ ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ పులి తో ఉన్న ఫైట్ సీన్ విశేషం గా ఆకట్టుకుంటుంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు ఈ సన్నివేశం కి సంబంధించిన ఒక ఫోటో ను సమంత సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది.

ఇది వంద శాతం నిజం అని నమ్మాను అంటూ చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఎలాంటి సందేహం లేదు అని అన్నారు. తారక్ నీ కళ్ళలో ఉన్న ఫైర్ తో ఏదైనా చేయగలవు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు సమంత చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పుష్ప లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాటకోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం :